అక్రమ వలసలు దేశంలో ఎక్కడా లేకుండా చేస్తాం

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతు దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ అమలుకు ఆయన సంకేతాలు ఇచ్చారు. దేశంలో ఎక్కడ అక్రమ వలసదారులు ఉన్నా వారిని దేశం నుంచి వెళ్లగొడతామని అన్నారు. అక్రమ వలసలు దేశంలో ఎక్కడా లేకుండా చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికి కేంద్రం కట్టుబడి ఉంటుందని, అలా వచ్చిన అక్రమ వలసదారులను అంతర్జాతీయ చట్టం ప్రకరమే వెనక్కి పంపిస్తామని తెలిపారు.

అసోంలో జరుగుతున్న జాతీయ పౌరుల నమోదు (ఎన్ఆర్‌సీ)లో మరింత పారదర్శకత్వ కోసం ఎన్‌ఆర్‌సీ తుది ప్రచురణ గడువును జూలై 31 నుంచి మరింత పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో నిన్న హామీ ఇచ్చింది. అక్రమ వలసదారుల అడ్డుకట్ట వేసేందుకు 1964 ఫారినర్స్ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద కేంద్రానికి అధికారులు ఉన్నాయని కూడా హోం శాఖ తెలిపింది. ఈ చట్టం కింద దేశంలో ఉంటున్న విదేశీ అక్రమ వలసదారులను గుర్తించి, వారిని నిర్బంధించి, వెనక్కి పంపే హక్కు కేంద్రానికి ఉంటుందని పేర్కొంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/