రాజ్యసభ సభ్యత్వాలకు అమిత్‌షా, రవిశంకర్‌,కనిమెళి రాజీనామా

Amit Shah, Ravi Shankar, Kanimozhi
Amit Shah, Ravi Shankar, Kanimozhi

న్యూఢిల్లీ: బిజెపి అధ్యక్షుడు అయిత్‌షా , ఆ పార్టీ నేత రవిశకంర్‌ ప్రసాద్‌, డీఎంకే నేత కనిమెళి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజసభ్య సెక్రటేరియట్‌ ఓ సర్క్యులర్‌లో తెలియజేసింది. అయితే ఇటివల జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అమిత్‌షా పోటీ చేసి గెలుపొందారు. బీహార్‌లోని పాట్నా సాహిబ్ నుంచి రవింశర్ ప్రసాద్, తమిళనాడులోని తూత్తుకుడి నుంచి కనిమొళి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/