జమ్మూ ప్రతినిధులతో అమిత్‌షా భేటీ

amith shah meeting
amith shah meeting


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌ సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామపంచాయతీల పెద్దలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ అయ్యారు. నెలరోజులుగా జమ్మూకాశ్మీర్‌ నిషేధాజ్ఞల నీడలో కొనసాగిన విషయం తెలిసిందే. మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాశ్మీర్‌ డివిజన్‌ కమిషనర్‌, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/