అమిత్‌షాకు అత్యధిక ప్రాధాన్యం!

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కీలకమైన ఎనిమిది కేబినెట్‌ కమిటీల్లో అమిత్‌ షాకు మోడి చోటు కల్పించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు మాత్రం కేవలం రెండు కమిటీల్లో మాత్రమే స్థానం దక్కింది. ప్రధాని మోడి , నిర్మలా సీతారామన్‌ ఆరు కమిటీల్లో ఉండగా, రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఐదు కమిటీల్లో ఉన్నారు. భద్రత, ఆర్థిక వ్యవహారాలపై నియమించిన రెండు కమిటీల్లో మాత్రమే రాజ్‌నాథ్‌ ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/