అమిత్ షాకు అస్వస్థత

Amit Shah
Amit Shah

అహ్మదాబాద్‌: కేంద్ర హోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న కేడీ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటీవల షా సొంత రాష్ట్రం గుజరాత్ కు చేరుకున్నారు. అనంతరం నిన్న సాయంత్రం కుటుంబంతో కలుసుకున్నారు. ఈరోజు తిరిగి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయితే అమిత్ షా ఏ ఆరోగ్య కారణంతో ఆసుపత్రిలో చేరారన్నవిషయమై ఇటు కుటుంబ సభ్యులు, అటు ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఓ చిన్న సర్జరీ కోసం షా కేడీ ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈరోజు సాయంత్రం షా డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/