బెంగాల్‌లో జరిగినట్టు హింసాత్మక ఘటనలు ఎక్కడ జరగలేదు

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే బాధ్యత ఆయన అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కేవలం పశ్చిమబెంగాల్‌లోని 42 సీట్లలోనే పోటీ చేస్తుంది, కానీ మేం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా పోలింగ్‌ బూత్‌ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారు. గత ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదు. దీనికి తృణమూల్‌ కాంగ్రెసే బాధ్యత వహించాలి అని అమిత్ షా అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/