పేలుడు ఘటనపై స్పందించిన అమిత్‌షా

ఆదుకుంటామని ముఖ్యమంత్రికి అమిత్‌షా భరోసా

amit shah
amit shah


న్యూఢిల్లీ:  కేంద్ర  హోం శాఖ మంత్రి అమిత్‌షా తమిళనాడులో థర్మల్ ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడు ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అవసరమైన కేంద్ర సాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి యడప్పాడి కె.పళనిస్వామికి ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి పళనిస్వామితో ఫోనులో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్టు అమిత్‌షా అమిత్‌షా తెలిపారు. అవసరమైన కేంద్ర సాయాన్ని ఆఫర్ చేసినట్టు చెప్పారు. ఘటనా స్థలికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సీఐఎస్ఎఫ్) చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. ‘నైవేలీ పవర్ ప్లాంట్ బ్రాయిలర్‌లో పేలుడు ఘటనలో పలువురు విలువైన ప్రాణాలు కోల్పోవడం విచారకరం. క్షతగాత్రులు త్వరితగతిన కోరుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని అమిత్‌షా తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/