మళ్లీ కలిసేందుకు నేతల ప్రయత్నాలు

Lalu Prasad, Nitish Kumar
Lalu Prasad, Nitish Kumar

పట్నా: బిజెపి -జేడీయూ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్జేడీ సానుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. మళ్లీ జేడీయూతో చేతులు కట్టాలనా భావిస్తుంది. అయితే పొత్తుకు సిద్ధమైనట్లు బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ పరోక్ష సంకేతాలు మాత్రం ఇచ్చింది.
ఆర్జేడీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రసాద్ సింగ్‌ దీనిపై మాట్లాడారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మహాగత బంధన్‌లోకి తిరిగి రావడమే ఆయన ముందున్న సరైన నిర్ణయమని అన్నారు. బిజెపితో ఉన్న జేడీయూకు ఎప్పటికయినా పరాభవం తప్పదని హెచ్చరించారు. నితీశ్ కుమార్‌ తమ వైపు వస్తే, బిజెపి పై ఎదురు తిరగడానికి మరింత బలం చేకూరుతుందన్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏవైనా జరగవచ్చని, ఇప్పటికీ తాము నితీశ్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఈ మాటలను మరో ఆర్జేడీ నేత మృత్యుంజయ్‌ తివారీ కూడా సమర్థించారు. నీతీశ్‌కు ఎప్పుడూ తమ మద్దతు ఉంటుదని తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/