కాంగ్రెస్‌, బిఎస్పీ మధ్య మళ్లీ పొత్తు!

congress and bsp
congress and bsp


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కాంగ్రెస్‌ బిఎస్పీ మధ్య మళ్లీ పొత్తు కుదరనుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో కలిసి నడవాలని రెండు పార్టీలు అనుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీ, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే పొత్తును హర్యానాలో కూడా కొనసాగించాలని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పది ఎంపి స్థానాలను అధికార బిజెపి కైవసం చేసుకుంది. దీంతో త్వరలోనే హర్యానాలో ఎన్నికలు జరుగనుండడంతో ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు పొత్తులపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే బిఎస్పీతో పొత్తుకు స్నేహ హస్తం అందించింది. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూపేందర్‌సింగ్‌ హుడా బిఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ప్రతిపాదనపై చర్చించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/