మాయావతితో అఖిలేశ్‌ సమావేశం

Akhilesh-Yadav-Mayawati
Akhilesh-Yadav-Mayawati

లఖనవూ: ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈరోజు లఖనవూలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వీరి సమావేశం చర్చనియాశంగా మారిది. గతవారం ఏపి సిఎం చంద్రబాబు మాయావతితో సమావేశమయ్యారు. వారు ఈ రోజు కోల్‌కతాలో టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీని కలిసే అవకాశం ఉంది. విపక్షాల కూటమి కోసం చంద్రబాబు వివిధ ప్రాంతీయ నేతలను కలుస్తూ, ముందుండి విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్నారు. మే 23న ఫలితాలు వెల్లడికావడానికంటే ముందే కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీల జాబితాను రాష్ట్రపతికి సమర్పించాలన్నది వీరి లక్ష్యంగా కనిపిస్తుంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/