ప్రధాని మోడిని 72ఏళ్లు నిషేధించాలి

Akhilesh Yadav
Akhilesh Yadav

లఖ్‌నవూ: ప్రధాని నరేంద్రమోడి తృణమూల కాంగ్రెస్‌ ఎమ్మెల్యెలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారంటూ చేసిని వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ మాజీ సిఎం, సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని స్థానంలో ఉండి అలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ని 72 ఏళ్ల పాటు రాజకీయాల నుండి నిషేదించాలంటూ అఖిలేశ్‌ తీవ్రంగా విమర్శించారు. 125 కోట్ల భారతీయుల విశ్వాసం కోల్పోయిన ఆయన ఇప్పుడు.. 40 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఆధారపడుతున్నారు. అది ఆయన( మోడి ) నల్ల ధన వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తోంది. ఆయనపై 72 గంటలు కాదు..72 ఏళ్ల నిషేధం విధించాలి అని ట్విటర్‌ వేదికగా అఖిలేశ్‌ ఘాటు విమర్శలు చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/