రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి

Akhilesh Yadav
Akhilesh Yadav

లఖ్‌నవూ: బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో నేరస్తుల పాలన సాగుతుందని, ప్రభుత్వాన్ని నేరస్తులే ఏలుతున్నారని ఆదివారం విడుదల చేసిన నివేదికలో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే సిఎం డీజీపీ పనికిమాలిన విషయాలపై రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తారు. కానీ రాష్ట్రంలో నేరస్తులు స్వైర విహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బీజేపీ పెద్దలే నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారు అని అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/