ఎమ్మెల్యె ఎంట్లో ఏకే-47 స్వాధీనం

MLA Anant Kumar Singh
MLA Anant Kumar Singh-ak-47

పట్నా: బిహార్‌లో స్వతంత్ర ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఇంట్లో శుక్రవారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎకె 47 రైఫిల్‌ను భారీగా బుల్లెట్లు, పేలుడు పదార్ధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంత్ కుమార్ సింగ్ మోకామాలో ఎమ్మెల్యే ఉన్నారు. దీనిపై అక్రమ ఆయుధాల నిరోధక చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం లాంటి పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాలను ఆ జిల్లా గ్రామీణ ఎస్పీ కంతేశ్‌ కుమార్‌ వెల్లడించారు. మెటల్‌ డిటెక్టర్ల వద్ద పట్టుబడకుండా దానికి కార్బన్ కవరింగ్‌ ఉన్నట్లు తెలిపారు. సోదాల్ని పూర్తిగా వీడియోలో చిత్రీకరించామన్నారు. ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/