పుల్వామా ఘటన దేశం మరవదు

ajit doval
ajit doval


హైదరాబాద్‌: జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ ధోవల్‌ నేడు 80వ సిఆర్‌పిఎఫ్‌ వార్షికోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల జరిగిన పుల్వామా దాడిని గుర్తు చేసుకుంటూ ధోవల్‌ ప్రసంగం చేశారు. ఆయన అమరవీరులకు వివాళి అర్పించారు. పుల్వామా ఘటనను ఈ దేశం మరిచిపోలేదని, చరిత్ర పుటలలో రక్తాక్షరాలతో లిఖించదగ్గ ఘటన అని , ఈ ఘటనను దేశం ఎప్పటికీ మరిచిపోవటం అంటూ జరుగదు అని ధోవల్‌ అన్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.