రాజకీయాల్లోకి యువసేన చీఫ్‌ ఆదిత్య థాకరే!

aditya thakre
aditya thakre

ముంబై: యువసేన చీఫ్‌ ఆదిత్య థాకరే(28) క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య థాకరే పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆదిత్య వోర్లి లేదా మహీం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని సమాచారం. తుది నిర్ణయం ఆదిత్య తండ్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యువసేన నాయకుడు వరుణ్‌ సర్ధేశా§్‌ు ఇన్‌స్టాగ్రాం వేదికగా ఆదిత్య రాజకీయ అరంగేట్రంపై పోస్టు చేశారు. ఆదిత్య థాకరే కోసం మహారాష్ట్ర వేచి చూస్తుందని పోస్టు చేశారు. ఇది ఒక మంచి అవకాశమని, దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/