పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఏసి త్రీ టైర్‌ కోచ్‌లు

ac three tier coach
ac three tier coach

హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఒక్కోదానికి మూడు ఏసి త్రీ టైర్‌ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సిపిఆర్‌ఓ రాకేష్‌ తెలపారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి, తిరుగు ప్రయాణంలో తిరుపతి-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబరు 2నుంచి ఏసి త్రీ టైర్‌ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ట్రైన్‌తో పాటు సికింద్రాబాద్‌-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబరు 1న, సికింద్రాబాద్‌-ముంబై సిఎస్‌ఎంటి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబరు 3న, తిరుగు ప్రయాణం రైలుకు అక్టోబరు 4న, కాచిగూడ-చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబరు 1న, చిత్తూరు-కాచిగూడకు వచ్చే రైలుకు అక్టోబరు2న ఏసి త్రీ టైర్‌ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. కాకినాడపోర్టు-లింగంపల్లి గౌతమి ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబరు1న, లింగంపల్లినుంచి కాకినాడపోర్టుకు వచ్చే రైలుకు అక్టోబరు 2న ఏసి త్రీ టైర్‌ బోగి ఏర్పాటు చేయనున్నారు. పైన పేర్కొన్న రైళ్లలో ఆయా తేదీల నుంచి ఏసి త్రీ టైర్‌ బోగీలు శాశ్వతంగా ఉండనున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/