సెలవులపై ఇంటికి అభినందన్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌పై వైమానిక దాడుల సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విచారణ పూర్తయింది. విచారణ పూర్తయిన నేపథ్యంలో అధికారులు అభినందన్ ను సిక్‌ లీవ్‌ మీద ఇంటికి పంపనున్నారు. అభినందన్ పాక్ నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత మొదటి 3 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలపై.. భారత వాయుసేన అధికారులు, ఇతర ఏజెన్సీలు అభినందన్ ను ప్రశ్నించాయి. డాక్టర్ల సూచనల మేరకు ఈ సెలవులను మూడు వారాల వరకూ కొనసాగించే అవకాశం ఉంది.

https://www.vaartha.com/news/national/
తాజా వార్తల కోసం జాతీయం క్లిక్‌ చేయండి: