సోనియా గాంధీని కలిసిన అల్క లంబా

Sonia Gandhi- Alka Lamba
Sonia Gandhi- Alka Lamba

న్యూఢిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యె అల్క లంబా యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. మంగళవారం సోనియా గాంధీ ఇంటికి వెళ్లి ఆమెను అల్క కలిసి వచ్చారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలలో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి అల్క గెలుపొందారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గత ఏడు నెలల నుంచి అల్క లంబా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలలో ఆప్ పార్టీ ఘోర పరాజయం పాలైన తరువాత ఆప్ అధినేత, సిఎం కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో ఆమెను ఆప్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. ఆప్ పార్టీ రాజీనామా చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/