ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం

road accident
road accident

రాయ్ పూర్: చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని మొహబత్తా పట్టణ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న 8 మందీ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.25 వేలు అందించినట్టు కలెక్టర్ శిఖా రాజ్‌పుత్ తివారీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/