ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే అరెస్టు

Piyush Goyal
Piyush Goyal

న్యూఢిల్లీ: రైళ్లలో మినరల్‌ వాటర్‌ పేరుతో కల్తీ నీళ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడతు ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు చేపట్టామన్నారు. దేశ వ్యాప్తంగా 300 చోట్ల రైల్వే అధికారులు దాడులు చేశారని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు పాంట్రీ కార్ల మేనేజర్లతో పాటు 800 మందిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. కల్తీ నీరు ఉన్న 48,860 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: