లక్నో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..8మంది మృతి

road accident
road accident

లక్నో: ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్‌ ఫతేబాద్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది దీంతో ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా మృతదేహాల వివరాలు తెలియాల్సి ఉంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/