70% స్థానికులకు ఉపాధి కల్పిస్తేనే పరిశ్రమలకు రాయితీలు

kamal nath
kamal nath

మద్యప్రదేశ్‌ముఖ్యమంత్రి కమల్‌నాధ్‌ తాజా నిర్ణయం
భోపాల్‌: ముఖ్యమంత్రిగాప్రమాణస్వీకారంచేసిన రోజుననే రూ.2లక్షలవరకూ రైతురుణాలు మాఫీచేస్తున్నట్లు మొదటిఫైలుపైమొదటి సంతకం చేసిన మద్యప్రదేశ్‌ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తాజాగా మరోనిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా 70శాతం మందికి ఉపాధికల్పించిన పరిశ్రమలకే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అమలుచేస్తామనిప్రకటించిమరో తీపి కబురు అందించారు. సీఎం కమల్‌నాథ్‌ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి విరివిగా లభిస్తుందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పెట్టుబడులు పెడుతున్న వారికి ఇకపై స్థానికంగా 70శాతంమందినినియమించుకుంటేనే ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన అన్నారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లనుంచి ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతున్నారని, స్థానికులకు ఉపాధి కరువవుతున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకోసమే తనవద్దకు వచ్చిన ఈఫైలుపై వెంటనేసంతకం చేసానని వెల్లడించారు. వ్యవసాయ సంక్షోభం, ఉపాధి మాంద్యంలపై కాంగ్రెస్‌ ఎన్నికల్లో విస్తృతంగాప్రచారంచేసిన సంగతి తెలిసిందే. మూడు హిందీ రాస్ట్రాల్లోను కాంగ్రెస్‌ బిజెపిని ఓడించింది. ఛత్తీస్‌ఘర్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో బిజెపిని గద్దెదించిన కాంగ్రెస్‌పార్టీ ఇపుడు వ్యవసాయ సంక్షోభం పరిష్కారమార్గాలపై దృస్టిపెట్టింది. ముందుగా పదిరోజుల్లోనే రుణమాఫీ అమలు పైళ్లపై సీఎంలు సంతకాలుచేసారు. ఇక తాజాగా యువతకు ఉపాధి అన్న అంశంపై దృస్టిపెట్టి స్థానికులకు ఎక్కువ ఉపాధికల్పించినపరిశ్రమలకే రాయితీలుప్రోత్సాహకాలు అందించాలనినిర్ణయించాయి. తాను అధికారంలోనికి వచ్చిన వెంటనే రైతురుణమాఫీ ఫైలుపై సంతకం చేసానని కమల్‌నాధ్‌ మీడియాతోమాట్లాడుతూ చెప్పారు. వీటకి అయ్యే ఆర్ధికభారంకోసం కొత్తవనరులు అభివృద్దిచేసి నిధులు సమకూర్చుకుంటామన్నారు. రాష్ట్ర ఖజానాను బిజెపి పాతాళానికి దించేసిందని అంగీకరించిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో నాలుగు గార్మెంట్‌ పార్కులను ఏర్పాటుచేస్తున్నామని, మరింతగా ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. ఈ కొత్త గార్మెంట్‌ పార్కులు యువతకు ఉపాధినిస్తాయని, పరోక్షంగా హోటల్స్‌, ప్యాకేజింగ్‌రంగంలో మరింత ఉపాధిని పెంచుతాయన్నారు. మద్యప్రదేశ్‌లో ఆర్ధిక కార్యకలాపాలు పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. 2018 మార్చి 31వ తేదీనాటికి ఉన్న రైతు రునాలు రూ.2లక్షలకు లోబడి ఉన్నవాటిని మాఫీచేస్తామని, కనీసం 34 లక్షల మంది రైతులు లబ్దిపొందుతారని అన్నారు. ఇందుకు ప్రభుత్వానికి రూ.35వేలనుంచి 38వేల కోట్ల భారం పడుతుందని, అయినా భరిస్తామని అన్నారు. ప్రభుత్వాలు పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు రుణాలు రద్దుచేస్తున్నపుడు రైతాంగానికి ఎందుకు అమలుచేయకూడదనిఆయన అన్నారు. 40-50శాతం వరకూ రద్దుచేస్తున్నారని, ఏ ఆర్దికవేత్త కూడా ఈ విధానాన్ని ప్రశ్నించలేదని అన్నారు. ఎప్పుడైనా రైతురుణమాఫీ అమలయితేచాలు ఎంతో నష్టంజరిగిపోతుందని చెపుతుంటారని ఆయన ఎద్దేవాచేసారు. ఆర్ధికవేత్తలు రెవెన్యూనష్టంపై ఉపన్యాసాలిచ్చేస్తారని, అయితే వారికి రైతులు, వ్యవసాయం, గ్రామాలపరిస్థితిపై అవగాహన ఉండదని అన్నారు. బ్యాంకులు విధిగా రుణమాఫీని పాటించాలనికోరారు.కన్యాదాన్‌యోజన కింద మహిళలకు రూ.28వేలనుంచి రూ.51వేలకు ఆర్ధికసాయం పెంచామన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలను ప్రభుత్వ కార్యాలయాల్లోఅనుమతించడంపై ఆయన మాట్లాడుతూ ఇదేమీ కొత్తకాదని, కేంద్రం, గుజరాత్‌ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా చేసారన్నారు.