7 విగ్రహాలు ఏర్పాటు చేస్తాం: యోగి

YOGI ADITYANATH
YOGI ADITYANATH
లఖ్‌నవూ: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో నాలుగు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. అందులో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్, స్వామి వివేకానంద విగ్రహాలు ఉన్నాయని ఆయన తెలిపారు.వాజ్‌పేయ్ విగ్రహాన్ని 25 అడుగుల ఎత్తులో లోక్‌ భవన్ సమీపంలో ఏర్పాటు చేస్తామని, రాజ్ భవన్ సమీపంలో 25 అడుగుల వివేకానంద విగ్రహాన్ని యోగి ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో మహంత్ అవైద్యనాథ్ విగ్రహాన్ని, మహంత్ దిగ్విజయనాథ్ విగ్రహాన్ని 12.5 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తామని యోగి తెలిపారు.దీనికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయిని, వీటి నిర్మాణానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. అయితే, ఈ ప్రకటన అనంతరం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం పనులు చేయాలని మాట్లాడడం సంతోషకరమని అన్నారు.