68 శాసనసభ స్థానాలకు 476 అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

Himachal pradesh
Himachal pradesh

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు నవంబర్‌ 9న జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో 68
శాసనసభ స్థానాలకుగాను 476 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హిమాచల్‌ అసెంబ్లీకి జనవరి 7,
2018 గడువు ముగియనుంది. నవంబర్‌ 9న పోలింగ్‌ నిర్వహిణ, డిసెంబర్‌ 18 ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
హిమాచల్‌ రాష్ట్రంలో 49.05లక్షల ఓటర్లు ఉన్నారు. 7,521 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. హిమాచల్‌
ప్రదేశ్‌లో 136 పోలింగ్‌ కేంద్రాలు తొలిసారి మహిళా సిబ్బంది పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. ఈ సారి
ఎన్నికలు పోలింగ్‌లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో పాటు వివిప్యాట్స్‌ను కూడా వినియోగించనున్నారు.