టిక్‌ టాక్‌ యాప్‌ నుండి 60 లక్షల వీడియోలు తొలగింపు

Tik Tok app
Tik Tok app

న్యూఢిల్లీ: టిక్‌ టాక్‌ యాప్‌లోని వీడియోలు పిల్లలపై చెడు ప్రభావం పడుతుందనే కారణంగా గతంలో ఈ యాప్ దేశ వ్యాప్తంగా బ్యానైంది. నిబంధనలకు వ్యతిరేకమైన వీడియోలు టిక్ టాక్ యాప్‌లో ఉండటంతో కేంద్రప్రభుత్వం తాజాగా యాప్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా 24 ప్రశ్నలను సంధించిన ప్రభుత్వం వాటికి వివరణ ఇవ్వాలని యాప్ యాజమాన్యాన్ని కోరింది. ఈ విషయంలో స్పందించిన యాప్ ప్రతినిధులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో 2018 జూలై నుంచి ఇప్పటి వరకు 60 లక్షల వీడియోలను యాప్ నుంచి తొలగించినట్లు తెలిపారు. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే వీడియోలను యాప్‌లోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/