ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా 31 మంది మృతి

అహ్మదాబాద్: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిని అకాల వర్షాల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లో 16 మంది, గుజరాత్లో 8 మంది, రాజస్థాన్లో అరుగురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్, పిలానీ, అజ్మేర్, చిత్తోర్ ఘర్ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/