దేశంలో ‘కరోనా’ కేసులు 30

యూపీలోని ఘజియాబాద్ లో ఓ వ్యక్తికి పాజిటివ్. ఒంగోలు రాంనగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు

Coronavirus cases reach 30 in the country

New Delhi: భారత దేశంలో కరోనా వైరస్ కేసులు ఇప్పటి వరకు 30కి చేరాయి. యూపీలోని ఘజియాబాద్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అలాగే ఒంగోలు రాంనగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.

ఫ్రాన్స్ కు వెళ్లి జర్మనీలో ఉండి అనంతరం మస్కట్ మీదుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అభిరామ్ బెంగళూరు చేరుకున్నారు.

అభిరామ్ ఫిబ్రవరి 21న బెంగళూరు నుంచి రాంనగర్ కు చేరుకున్నారు. అనారోగ్యంతో రిమ్స్ ఆస్పత్రిలో చేరగా కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అభిరామ్ శాంపిల్స్ ను వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/