3పాన్‌కార్డులు ఉంటే తప్పదు జరిమానా

PANCARd22
PANCARD

ఒకే వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉంటే చట్ట విరుద్ధమని, ఆదాయపుపన్ను చట్టం 1961, సెక్షన్‌ 272బి ప్రకారం జరిమానా తప్పదని సదరు శాఖ హెచ్చరించింది. ఒకవేళ రెండు లేదా మూడు కార్డులు ఉంటు వెంటనే వాటిని ఆన్‌లైన్‌ లేక ఆఫ్‌లైన్‌ ద్వారా రద్దు చేసుకోవాలని సూచించింది.రెండు పాన్‌కార్డులు కలిగి ఉంటే రూ.10వేలు జరిమానా పడుతుందని పేర్కొంది. ఒకే పాన్‌కార్డు వాడుతూ మిగతావి రద్దు చేయాలని సూచించింది. ఇందుకోసం https://www.incometaxindia.gov.in లాగిన్‌ అవ్వాలి. అందులో ఎడమ వైపున ఇంపార్టెంట్‌ లింక్స్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేసి సిఎస్‌ఎఫ్‌ పారంలో ఐటెం నం.11లో మీ వద్ద ఉన్న రెండో పాన్‌కార్డు వివరాలు ఇస్తే రద్దు అవుతుంది.