జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభం

20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్

voting
voting

రాంచి: ఈ ఉదయం నుండి జార్ఖండ్‌లో రెండో దశ అసెంబ్లీ పోలింగ్‌ ప్రారంభమైంది.మొత్తం 20 అసెంబ్లీ స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ జంషెడ్‌పూర్ ఈస్ట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. అలాగే, స్పీకర్ దినేశ్ ఓరాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/