2019లో సోనియా, రాహుల్ ల ఓట‌మి ఖాయంః బిజెపి

rahul and sonia
rahul and sonia

న్యూఢిల్లీః పార్లమెంటుకు 2019లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తమ నియోజక వర్గాల్లో ఓటమి పాలవుతారని బిజెపి వ్యాఖ్యానించింది. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ వారణాశి నియోజక వర్గంలో ఓటమిపాలవుతారని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా బిజెపి పైవిధంగా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ నేతలిద్దరి పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బిజెపి పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ భవితవ్యం గురించి రాహుల్‌ గాంధీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 2019 ఎన్నికల్లో తమ భవితవ్యంపై రాహుల్‌ దృష్టి సారించాలని బిజెపి అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ అన్నారు. అమేథీ, రాయ్‌బరేలీనుంచి వారిద్దరూ
ఓటమిపాలవుతారని, తమ నియోజక వర్గాలకు రాహుల్‌, సోనియాలు చేసిందేమీ లేదని ఆయన అన్నారు.