పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ట్రాల్‌లోని ఓ రెసిడెన్షియల్‌ ప్లాట్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమచారంతో భద్రతా బలగాల గాలింపు చర్యలు

Indian Army
Indian Army

శ్రీనగర్‌: ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రాల్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ట్రాల్‌లోని ఓ రెసిడెన్షియల్‌ ప్లాట్‌లో కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ సమాచారం అందడంతో బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో వారిపై అక్కడున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువైపులా హోరాహోరీగా జరగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం గుల్షన్‌పోర ఏరియాలో బలగాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. కాగా మరో సంఘటనలో షోపియాన్‌లోని నర్భల ఓంపోరలో మిలిటెంట్ల స్థావరం ఒకటి పోలీసుల గాలింపు చర్యల్లో బయటపడింది. అక్కడున్న బ్లాంకెట్లు, ఆహార పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/