బెంగాల్‌లో క్రూడ్‌ బాంబు పేలి ఇద్దరు మృతి

bomb blast
bomb blast

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లా కంకినారా గ్రామంలో క్రూడ్‌ బాంబు పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి క్రూడ్‌ బాంబు వేశారు. ఈ బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాంబు పేలుడు అనంతరం దుండగులు గ్రామంలో యథేచ్చగా దోచుకున్నారు. ఈ ఘటన అనంతరం కంకినారా గ్రామంలో సాయుధ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/