2జీ కేసులో పలువురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

raja, kanimozhi
raja, kanimozhi

న్యూఢిల్లీః 2జీ కేసులో మాజీ కేంద్ర మంత్రి ఏ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు మరో 17 మందికి ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో ఇటీవల ప్రత్యేక సీబీఐ కోర్టు రాజాతో పాటు ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఆ కేసులో మళ్లీ సీబీఐతో పాటు ఈడీలు హైకోర్టును ఆశ్రయించాయి. 2జీ కేసులో తాము సరైన ఆధారాలు ఇచ్చినా.. ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగా లేదని సీబీఐ పేర్కొన్నది. గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన వెలుబడిన తీర్పులో రాజా, కనిమొళిలు.. 2జీ కేసులో క్లీన్‌గా తేలారు.