దివ్యాంగులు 18 జంటలకు సామూహిక వివాహాలు

18 specially-abled couples
18 specially-abled couples


హైదరాబాద్‌: గుజరాత్‌లోని వడోదరలో దివ్యాంగులకు (18 జంటలు) సామూహిక వివాహాలు జరిపించారు. సామూహిక వివాహాలను జరిపించేందుకు ముందుకు వచ్చిన రాజేశ్ అయేర్ మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల ఇది సాధ్యమైందన్నారు. వడోదర ప్రజల సహకారంతోనే దివ్యాంగులకు వివాహాలు చేయగలిగామని తెలిపారు. గుజరాత్ సంప్రదాయం ప్రకారం.. వేదమంత్రాల సాక్షిగా ఈ 18 జంటల వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు వచ్చిన వారందరికీ విందు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఓ వరుడు ముఖేష్ మాట్లాడుతూ.. ఇది ఒక మంచి సంప్రదాయం. తమకు పెళ్లిళ్లు చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ విధంగా తన పెళ్లి జరుగుతుందని కలలో కూడాఊహించలేదు అని పేర్కొన్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/