బార్‌పై దాడులు ..18 మంది అరెస్ట్‌

arrested
arrested

పల్ఘార్‌: బార్‌లపై మహారాష్ట్ర పోలీసులు దాడులు చేపట్టారు. బార్‌లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో క్రైం బ్రాంచ్ పోలీసులు వెసాయ్ ప్రాంతంలోని ఓ బార్‌పై దాడులు నిర్వహించారు. అయితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బార్ మేనేజర్‌తోపాటు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 13 మంది మహిళలు, ఇద్దరు వెయిటర్లు, కస్టమర్లు ఉన్నారు. అరస్టైన వారిపై ఐపీసీ సెక్షన్ 294 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/