మధ్యప్రదేశ్‌లో 15 కోతులు మృతి

monkeys
monkeys

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని జోషి బాబా అటవీ ప్రాంతంలో 15 కోతులు మృతి చెందాయి. కోతుల మృతికి వడదెబ్బే కారణమని అటవీశాఖ అధికారులు తేల్చారు. దేవాస్ జిల్లాలోని జోషి బాబా అటవీ ప్రాంతంలో మేకలను మేపేందుకు ఓ బాలుడు వెళ్లాడు. ఈ బాలుడికి చనిపోయిన కోతులు కనిపించాయి. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. అనంతరం గ్రామస్తులు జిల్లా అటవీ శాఖ అధికారులకు కోతుల మృతిపై సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చనిపోయిన 15 కోతులను పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కోతులు వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు అధికారులు తేల్చారు.