మునిగిన బోట్లు…15 మంది మత్స్యకారులు మృతి

fishermens
fishermens

అహ్మదాబాద్: గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక, పోరబందర్ తీర ప్రాంతంలో బోట్లు మునిగిపోవడంతో 15 మంది మత్స్యకారులు జలసమధి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. ద్వారక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఉ 24 మంది మత్సకారులు ఆరు బోట్ల సహాయంతో రుపెన్ పోర్టు తీరంలో చేపలను వేటాడి తిరిగి వస్తుండగా బోట్లు నీళ్లలో మునిగిపోయాయి. ఏడుగురు మత్సకారులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఈ ఘటనలో 15 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో ఇద్దరు కోసం తీర రక్షక దళం గాలింపు చర్యలు చేపట్టింది. గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలలో చిక్కుకొని ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. జూన్ 15 నుంచి అగస్టు 30 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తీర రక్షక అధికారులు హెచ్చరిస్తున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/