15 శాతం పెరిగిన క్యాబ్‌ చార్జీలు

UBER, OLA
UBER, OLA

బెంగుళూరు: ఓలా, ఉబర్‌ చార్జీలు 15 శాతం మేర పెంచుతున్నట్లు క్యాబ్స్‌ సలహా సంస్థ రెడ్‌ సీర్‌ ప్రకటించింది. గత ఏడాది పదిశాతం మేర చార్జీలు పెంచిన ఓలా, ఉబర్‌ ఏడాదికే మరోమారు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశంలో వివిధ నగరాలను బట్టి చార్జీలు మరుతూ ఉంటాయని , క్యాబ్‌ డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు క్యాబ్‌ రైడ్‌ మొత్తాన్ని రూ.190 నుంచి రూ. 220 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఇంధన ధరలు, పెరిగిన నిర్వహణ వ్యయం వల్ల చార్జీలు పెంచారని సమాచారం.