బస్సు బోల్తా, 12 మందికి గాయాలు

bus accident
bus accident


శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలికి ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇంకా చిక్కుకుని ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీస్తున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/