గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Road accident in Gujarat
Road accident in Gujarat

వడోదర: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, టెంపో ఢీకొని 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వడోదర జిల్లాలోని పాద్రా తాలూక పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. తమ బంధువుల వివాహ ముందుస్తు వేడుకలకు పలువురు హాజరై తిరిగి తమ ఇళ్లకు టెంపోవాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో తాము ప్రయాణిస్తున్న వాహనం, ట్రక్కు ఎదురెదురుగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఘటన స్థలంలోనే తీవ్రగాయాలతో ఏడుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతిచెందారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/