11 రోజుల్లో షిర్టీ ఆలయానికి రూ.14.54 కోట్ల విరాళాలు

SHIRDI SAI
SHIRDI SAI

ముంబయి : మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి 11 రోజుల్లో రూ.14.54 కోట్ల విరాళాలు వచ్చాయని ఆ సంస్థాన్‌ ట్రస్ట్‌ వైస్‌ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ కదాం మీడియాకు తెలిపారు. డిసెంబరు 22 నుంచి జనవరి 1 వరకు ఆలయానికి వచ్చిన విరాళాలపై ఆయన వివరాలు తెలిపారు. హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం రూ.8.05 కోట్లని చెప్పారు. అలాగే, ఆన్‌లైన్, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, చెక్కులు, డీడీల‌ ద్వారా దేవాలయ ట్రస్టుకి రూ.6 కోట్లు వచ్చాయని చెప్పారు. రూ.19 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను భక్తులు విరాళంగా ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఆలయానికి వచ్చిన విరాళాల్లో అమెరికా, యూకే, మలేషియా, సింగపూర్‌, జపాన్‌, చైనా సహా మొత్తం 19 దేశాల భక్తులు ఇచ్చిన విదేశీ కరెన్సీ రూ.30.63 లక్షలుగా ఉందని తెలిపారు.