పాకిస్థాన్‌ నుండి 100 మంది భారత జాలర్లు విడుదల

 Indian fishermens
Indian fishermens

గుజరాత్‌: పాకిస్థాన్‌ నుండి 100 మంది భారత జాలర్లు ఏప్రిల్‌ 8న విడుదలై గరువారం రాత్రి వడోదర చేరుకున్నారు. అయితే 7 నెలల క్రితం.. వడోదరకు చెందిన జాలర్లు.. చేపలు పడుతూ అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి వెళ్లారు. దీంతో 100 మంది జాలర్లను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం కరాచీ జైలులో వారిని నిర్భంధించారు. ఏడాదిన్నర కాలం తర్వాత జాలర్లను జైలు నుంచి విడుదల చేసి ఈ నెల 8న అట్టారీ వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించారు. అక్కడ్నుంచి అమృత్‌సర్ మీదుగా వడోదరకు రైలులో జాలర్లను తరలించారు. ఇటీవల రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. తమను ఒక గదిలో బంధించారని, వేరే చోటకు వెళ్లేందుకు అనుమతించలేదని ఓ జాలరి పేర్కొన్నాడు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/