హిందూ అతివాదుల హిట్‌లిస్ట్‌లో గిరీష్‌ కర్నాడ్‌

GIRISH KARNAD
GIRISH KARNAD

బెంగళూరు: గౌరీలంకేష్‌ హత్యకేసుకు సంబంధించి మరికొందరిని హత్యచేసే లక్ష్యంతో ఉన్న పేర్ల జాబితా ఉన్న డైరీని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ జాబితాలో ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌పేరు కూడా ఉంది. జర్నలిస్టు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేష్‌ హత్యకేసులో నిందితులనుంచి స్వాధీనంచేసుకున్న డైరీనిపరిశీలించినపోలీసులు వివరాలుచూసి షాక్‌ అయ్యారు. హిందూత్వ వాదులు ఎక్కువగా విమర్శిస్తున్న వారిలో గిరీష్‌కర్నాడ్‌ కూడా ఒకరు. జాబితాలో ముందు గిరీష్‌ పేయిండగా రెండోపేరుగా గౌరీ లంకేష్‌పేరు ఉంది. హిందూ హింసావాదులగ్రూప్‌ ఒక జాబితాను రూపొందించింది. గౌరీలంకేష్‌పేరు ఈ జాబితాలో రెండుగా ఉంది. గిరీష్‌పేరును హిట్‌లిస్ట్‌లో మొదటిపేరుగా ఉంది. దేవనగరి లిపిలో ఈ ఎంట్రీలు ఉన్నాయని ప్రత్యేక దర్యాప్తు కమిటీ సిట్‌ వెల్లడించింది. రాజకీయ వేత్త సాహితీవేత్త బిటి లలితనాయక్‌, మఠాధిపతి వీరభద్ర చన్నమళ్ల స్వామి హేతువాది సిఎస్‌ ద్వారకానాధ్‌ వంటివారిపేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు హిందువులపై తరచూ విమర్శలుచేస్తున్నవారిగా హిందూ అతివాదులు జాబితా రూపొందించారు. ఈకేసులో సిట్‌ ఇప్పటివరకూ పదిమంది నిందితులను అరెస్టుచేసింద.ఇ రాజేష్‌ డి బంగేరా 50ఏళ్ల నిందితుడిని కొడగుజిల్లాలోని మడికేరి నుంచి అరెస్టుచేసినట్లు వెల్లడించింది.