హరేన్‌పాండ్య కాల్చివేతకు సోహ్రాబుద్దీన్‌కు కాంట్రాక్టు

DIG, VANJARA
DIG, VANJARA

సిబిఐ కోర్టులో సాక్షి వాంగ్మూలం
అహ్మదాబాద్‌: మాజీ పోలీస్‌ ఉన్నతాధికారి డిజి వంజర హరేన్‌పాండ్యను హత్యచేసే కాంట్రాక్టుసోహ్రాబుద్దీన్‌కు ఇచ్చారని సాక్షి తన వాంగ్మూలం ఇచ్చాడు. ఈ అంశాన్ని 2010లోనే తాను సిబిఐ విచారణాధికారికి చెప్పానని, అయితే అధికారి తన సాక్ష్యాన్ని నమోదుచేసేందుకు నిరాకరించారని సాక్షి వెల్లడించాడు. గుజరాత్‌ మాజీ మంత్రి హరేన్‌పాండ్యను చంపాలన్న కాంట్రాక్టు సోహ్రాబుద్దీన్‌కు ఇచ్చారని సాక్షి ఆజమ్‌ఖాన్‌ వెల్లడించాడు. సోహ్రాబుద్దీన్‌, తులసీరామ్‌ప్రజాపతిలకు సన్నిహితుడుగా ఉన్న ఆజమ్‌ఖాన్‌ ఈ సాక్ష్యాం అనాడే చెప్పానని అయితే అప్పటి సిబిఐ అధికారి నమోదుకు తిరస్కరించడాని చెప్పాడు.2003 మార్చి 26వ తేదీ పాండ్య అహ్మదాబాద్‌లోని లాగార్డెన్‌లోనే తన కారులో కాల్చిచంపపడ్డాడు. ఆజమ్‌ఖాన్‌ తన సాక్ష్యంలో తాను షేక్‌ను 2002లోనే కలిసానని, అత్యంత మంచిమిత్రులుగా కొనసాగామని, ఆయన భార్య కౌసర్‌బీతోపాటు తుల్సి ప్రజాపతి కూడా అత్యంత సన్నిహిత మిత్రులుగామెలిగామని చెప్పాడు. ఆసమయంలోనే సోహ్రాబుద్దీన్‌ తనకు సమాచారం చెపుతూ డిజి వంజర తనకు సొమ్ము ఇచ్చాడని, గుజరాత్‌ హోంమంత్రి హరేన్‌పాండ్యను చంపాలని చెప్పారని తాను ఆపనిపూర్తిచేసినట్లు వెల్లడించాడన్నారు. అయితే ఆయన మంచిమనిషి అని అలాంటి వారిని ఏం తప్పుచేసారని చంపారని ప్రశ్నించారని, మంచిమనిషిని చంపారని చెప్పానన్నాడు. 2005లోనే ఖాన్‌ను రాజస్థాన్‌ప ఓలీసులు అరెస్టుచేసి ఉద§్‌ుపూర్‌జైలులో ఉంచారు. అక్కడ ఆతడు ప్రజాపతిని కలిస్తేతనకు సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌గురించి చెప్పాడన్నారు. ప్రజాపతి తనతోమాట్లాడుతూ గుజరాత్‌పోలీసులు సోహ్రాబుద్దీన్‌ను, ఆతని సతీమణి కౌసర్‌బీని కాల్చి చంపేసారని చెప్పాడని ఖాన్‌స్పెసల్‌ సిబిఐ జడ్జి ఎస్‌జెశర్మముందు సాక్ష్యం చెప్పాడు. ఖాన్‌ ఉద§్‌ుపూర్‌ కేంద్రంగా ఉన్నగ్యాంగ్‌స్టర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆతన్ని భారీ బందోబస్తుమధ్య ఉద§్‌ుపూర్‌ కేంద్రకారాగారంనుంచి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సాక్ష్యాన్ని వచ్చేవారం కూడా కొనసాగిస్తారు. బోగస్‌ ఎన్‌కౌంటర్‌లో షేక్‌,ఆతని భార్యను చంపేసారని, 2005లో గుజరాత్‌పోలీసులే కాల్చివేసారని అన్నాడు. ప్రజాపతిని కూడా ఆ తర్వాత గుజరాత్‌, రాజస్థాన్‌ పోలీసులు బోగస్‌ ఎన్‌కౌంటర్‌లో చంపేసారని పేర్కొన్నాడు. మొత్తం 38 పై సిబిఐ ఈ రెండు బోగస్‌ ఎన్‌కౌంటర్ల దర్యాప్తులో అభియోగాలు నమోదుచేసింది. 16మందిని విచారణకోర్టు విడుదలచేసింది. వారిలో బిజకపి ఛీప్‌ అమిత్‌షా, వంజర, ఇతర గుజరాత్‌, రాజస్థాన్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారులుసైతం ఉన్నారు.