హరితహారం ఒక అద్భుత కార్యక్రమం: జమాతియా

Mewar Kumar Jamatia
Mewar Kumar Jamatia

గువహటి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంపై త్రిపుర అటవీశాఖ మంత్రి మేవార్‌ జమాతియా ప్రశంసట కురిపించారు. రాష్ట్ర మంత్రి జోగురామన్న త్రిపురలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జమాతియాతో మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. త్రిపురలో అటవీశాఖ స్థితిగతులను మంత్రికి జమాతియా వివరించారు. హరితహారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు పెంచాలన్న సియం కేసిఆర్‌ ఆలోచన అద్భుతమని అన్నారు జమాతియా.