స‌మ్మె విర‌మించండి.. ఆర్టీసి కార్మికుల‌కు ఆదేశాలుః హైకోర్టు

 

Madras High Court
Madras High Court

చెన్నై: వేతన పెంపు డిమాండ్‌తో తమిళనాడులో ఆర్టీసీ కార్మికులుచేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరగా ప్రయాణికుల అవస్థలు కొనసాగుతున్నాయి. తక్షణమే సమ్మె విరమించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని కార్మికులను ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులను తమ అనుమతి లేకుండా విధుల నుంచి తొలగించవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ నెల 5న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల ఉపసంహరణకు మద్రాస్‌ హైకోర్టు నిరాకరించింది. వేతన బకాయిలను పొందడం కార్మికుల హక్కే అయినా అందుకోసం సమ్మెచేసి ప్రజలను అసౌకర్యానికి గురిచేయడం తగదని హితవు పలికింది. సమ్మె కారణంగా ప్రభుత్వాధికారులు, రవాణామంత్రికి ఎలాంటి ఇబ్బంది లేదని పేద, మధ్య తరగతి ప్రజలే అవస్థలు పడుతున్నారని మద్రాసు హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.