స్వ‌ర్ణ‌యుగం దిశ‌గా మోది అడుగులు

modi
modi

ఢిల్లీః ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచే భారతీయ జనతా పార్టీ స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తోందని భారత్‌-అమెరికా
మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ఎక్కువకాలం దేశాన్ని పాలించి కీర్తిగడించిన కాంగ్రెస్‌ను వెనక్కి నెడుతూ భాజపా దేశంలో
ఎదుగుతోందని గురువారం కార్నెగీ ఎండోమెంట్‌ పీస్‌ సంస్థ సంచాలకులు, రాజకీయ విశ్లేషకులు మిలాన్‌ వైష్ణవ్‌ తన వ్యాసంలో
అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో భాజపా జెండాను ఎగరేసి పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడంతో మోదీ కీలకపాత్ర
పోషిస్తున్నారని పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని భాజపా రాజ్యసభలో ఆధిక్యం దిశగా దూసుకుపోతుందన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడమే కాకుండా రాష్ట్రాల్లో సైతం పాగా వేయాలని భాజపా చూస్తోందని
వివరించారు. తమ పార్టీని రాష్ట్రాల్లో బలోపేతం చేసుకోవడమే కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా
భాజ‌పా హ‌వా న‌డుస్తోంది.