స్మారక చిహ్నాలు దళతులకు గొప్ప గుర్తుంపు

MAYAVATHI
MAYAVATHI

లక్నో: బీఎస్పీ నేత మాయావతికి నిన్న సుప్రీంకోర్టు విగ్రహలకు అయిన ఖర్చును ప్రభుత్వ ఖాజానాకు తిరిగి చెల్లించాలని ఆమెను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పుపై ఆమె ఈరోజు ట్విట్టర్‌లో స్పందించారు. విగ్రహాల నిర్మాణాలను సమార్థంచుకున్నారు. తన విగ్రహాలతో పాటు తన పార్టీకి చెందిన ఏనుగు విగ్రహాలను యూపీలో మాయావతి ప్రతిష్టించారు. కగా సుప్రీం తీర్పును తప్పుపట్టిన ఆమె స్మారక చిహ్నాలు దళితులకు గొప్ప గుర్తింపును ఇస్తాయన్నారు. అంతేకాకుండా ఆ స్మారకాలతో ప్రభుత్వానికి రెగ్యూలర్‌ ఆదాయం వస్తుందన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పుగా చిత్రీకరించరాదు అని ఆమె మీడియాను కోరారు.