స్టాలిన్‌ చెప్పితే ఎక్కడైనా పోటి చేస్తా

Kanimozhi
Kanimozhi

చెన్నై: డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి రాబోయే ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గంలో పోటి చేయనున్నట్లు తెలుస్తుంది. ఆమె జిల్లాలో 12 రోజులపాటు పర్యటిస్తున్నారు. ఈవిషయంపై కనిమొళి మీడియాతో మాట్లాడు తన సోదరుడు, డీఎంకే అధ్యక్షుడు ఆదేశిస్తే తూత్తుకుడిలోనే కాదు ఎక్కడైనా పోటీకి సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. ఇటీవలే కనిమొళి తూత్తుకుడి జిల్లా డీఎంకే ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. ఆ జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి హోదాలో కనిమొళి శుక్రవారం తన పర్యటనను ప్రారంభించారు.