సొమ్మసిల్లి ప‌డిపోయిన‌ నితిన్‌ గడ్కారీ

nitin gadkari
nitin gadkari

అహ్మద్‌నగర్‌: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ అస్వస్థతకు గురయ్యారు. అహ్మద్‌నగర్‌లో జరుగుతున్న కాన్వొకేషన్‌ సభలో పాల్గొన్న ఆయన సభావేదికపై సొమ్మసిల్లి పడిపోయారు. మహాత్మా పూలె క్రిషి విద్యాపీఠం వ్యవసాయ యూనివర్సిటీలో జరుగుతున్న కాన్వోకేషన్‌ సభకు హాజరైన గడ్కారి ,జాతీయ గీతం పాడుతున్న సమయంలో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న ఆయన అనుచరులు, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.